కుక్కల బెడదపై GHMCకి ఫిర్యాదుల వెల్లువ.. 36 గంటలలో 15 వేల ఫిర్యాదులు
Complaints to GHMC: హైదరాబాద్ అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో ప్రదీప్ మృతి చెందిన ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది.
కుక్కల బెడదపై GHMCకి ఫిర్యాదుల వెల్లువ.. 36 గంటలలో 15 వేల ఫిర్యాదులు
Complaints to GHMC: హైదరాబాద్ అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో ప్రదీప్ మృతి చెందిన ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీకి అయితే ఈ ఫిర్యాదులు వందలు దాటి వేలకు చేరుకున్నాయి. గడిచిన 36 గంటల్లో సుమారు 15 వేల ఫిర్యాదులు అందాయని జీహెచ్ఎంసీ వెల్లడించింది. సగటున గంటకు 416 ఫిర్యాదులు అందుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో ఇప్పటివరకు 500 వీధికుక్కలను జీహెచ్ ఎంసీ సిబ్బంది పట్టుకున్నారు. కానీ నగరంలో 5 లక్షలకు పైగా కుక్కలు ఉన్నట్లు అంచనా. వాటిని పట్టుకునేందుకు సమయం పడుతుందని చెబుతున్నారు.