Hyderabad Job Market టాప్-10 డిమాండ్ ఉన్న ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఏఐ ఇంజినీర్లదే హవా! లింక్డ్‌ఇన్ 2026 నివేదిక ప్రకారం నగరంలో ఫుల్ డిమాండ్ ఉన్న టాప్-10 ఉద్యోగాలు ఇవే. మీ స్కిల్స్ మార్చుకోవడానికి రెడీనా?
కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా, వివిధ రంగాల్లో ఏఐ నైపుణ్యం ఉన్న వారికి కంపెనీలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. అత్యధిక వృద్ధి కనిపిస్తున్న ఉద్యోగాలు ఇవే:
- ఏఐ ఇంజినీరింగ్ (AI Engineering)
- మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ (Marketing Strategist)
- సొల్యూషన్స్ అనలిస్ట్ (Solutions Analyst)
- వీపీ - బిజినెస్ స్ట్రాటజీ (VP - Business Strategy)
- హెచ్ఆర్ రిప్రజెంటేటివ్ (HR Representative)
- వీపీ - బిజినెస్ డెవలప్‌మెంట్ (VP - Business Development)
- ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంట్ (Interior Design Consultant)
- మెషీన్ లెర్నింగ్ రీసెర్చర్ (Machine Learning Researcher)
- హెడ్ - సప్లై చైన్ మేనేజ్‌మెంట్ (Head - Supply Chain Management)
- అడ్వర్టైజింగ్ సేల్స్ డైరెక్టర్ (Advertising Sales Director)
మారుతున్న ఉద్యోగ వేట - నిపుణుల ఆందోళన
సాంకేతికత మారుతున్న వేళ, నిపుణుల్లో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి:
నైపుణ్యాల కొరత: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ స్కిల్స్ సరిపోతాయా లేదా అని 38 శాతం మంది భయపడుతున్నారు.
ఏఐ వినియోగం: భారత్‌లో దాదాపు 94 శాతం మంది ఉద్యోగ వేటలో ఏఐ సాధనాలను వాడుతున్నారు. అయితే, ఏఐ వాడటం వల్ల తమ ప్రొఫైల్ రిక్రూటర్ల కంట పడటం కష్టమవుతుందని 54 శాతం మంది భావిస్తున్నారు.
కెరీర్ మార్పు: 2026లో దాదాపు 72 శాతం మంది కొత్త ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నట్లు నివేదిక వెల్లడించింది.
నిపుణుల సూచన: ఏఐ స్కిల్స్ మస్ట్!
లింక్డ్‌ఇన్ కెరీర్ ఎక్స్‌పర్ట్ నిరాజిత బెనర్జీ అభిప్రాయం ప్రకారం, హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఐటీ సేవలకే పరిమితం కాలేదు. ఇది ఒక మల్టీ-సెక్టార్ హబ్‌గా మారింది. మీరు మార్కెటింగ్, కన్సల్టింగ్ లేదా అనలిటిక్స్.. ఏ రంగంలో ఉన్నా సరే, మీ ప్రాజెక్టులలో ఏఐ (AI Skills)ని ఎలా వాడుతున్నారనేదే మీ సక్సెస్‌ను నిర్ణయిస్తుంది.
Quick Job Market Highlights - 2026