ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ అయిన హరీష్ రావు
ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు.
ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు నిన్నటి విచారణ అంశాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో పోలీసులు నిన్న హరీష్‌రావును ఏడున్నర గంటల పాటు విచారించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు మాట్లాడారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై ఏదో వంకతో తనను అక్రమంగా కేసులతో విచారిస్తున్నారని ఆరోపించారు. తాజాగా హరీష్‌రావు కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.