TG Group 1 Case: తెలంగాణ గ్రూప్-1పై హైకోర్టు బ్రేక్.. తీర్పు వచ్చే నెలకు వాయిదా
TG Group 1 Case: గ్రూప్-1 పరీక్షలకు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. తీర్పు కాపీ సిద్ధం కాలేదని తెలిపిన ధర్మాసనం, ఫిబ్రవరి 5న తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
TG Group 1 Case: తెలంగాణ గ్రూప్-1పై హైకోర్టు బ్రేక్.. తీర్పు వచ్చే నెలకు వాయిదా
TG Group 1 Case : తెలంగాణ గ్రూప్-1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా పడింది. ఈ వ్యవహారంపై వచ్చే నెల 5వ తేదీన తీర్పును వెల్లడిస్తామని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని కోర్టు న్యాయవాదులకు తెలిపింది.
గ్రూప్-1 పరీక్షలకు సంబంధించిన కీలక అంశాలపై ఇప్పటికే విస్తృతంగా వాదనలు వినిపించగా, తీర్పు కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తీర్పు వాయిదా పడటంతో గ్రూప్-1 అభ్యర్థుల్లో అనిశ్చితి కొనసాగుతోంది. వచ్చే నెల 5న వెలువడే తీర్పుతో స్పష్టత వచ్చే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.