Kamareddy Tragedy: కామారెడ్డిలో కోతుల మందపై విషప్రయోగం - పది కోతులు మృతి
Kamareddy Tragedy: కామారెడ్డి జిల్లా అంతంపల్లి శివారులో గుర్తు తెలియని వ్యక్తులు కోతులపై విషప్రయోగం చేశారు. ఈ ఘటనలో పది కోతులు మృతి చెందగా, మరికొన్నింటిని పశు వైద్య సిబ్బంది రక్షించారు.
Kamareddy Tragedy: కామారెడ్డిలో కోతుల మందపై విషప్రయోగం - పది కోతులు మృతి
Kamareddy Tragedy: కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామ శివారులో కోతుల మందపై విషప్రయోగం జరగడంతో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు కోతులపై విషం పెట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో పది కోతులు మృతి చెందగా, మరికొన్ని కోతులు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నాయి.
గ్రామ శివారులోని ఓ ధాబా హోటల్ సమీపంలో కోతులు మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే గ్రామ సర్పంచ్‌కు సమాచారం అందించారు. సర్పంచ్ సమాచారం మేరకు పశు వైద్య సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని తీవ్ర స్థితిలో ఉన్న కోతులకు ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోతులపై విషప్రయోగానికి బాధ్యులైన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వరుసగా జంతువులపై జరుగుతున్న క్రూరత్వ ఘటనలతో జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.