HYDRA: శామీర్‌పేట్‌లో హైడ్రా కూల్చివేతలు.. 20 అడుగుల రోడ్డుపై ఆక్రమణ తొలగింపు

HYDRA: శామీర్‌పేట్ ఫ్రెండ్స్ కాలనీలో 20 అడుగుల ప్రభుత్వ రోడ్డుపై ఆక్రమణగా నిర్మించిన ప్రహారీ గోడను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాకపోకలకు ఇబ్బందులు తొలగాయి.

Update: 2026-01-22 05:55 GMT

HYDRA: శామీర్‌పేట్‌లో హైడ్రా కూల్చివేతలు.. 20 అడుగుల రోడ్డుపై ఆక్రమణ తొలగింపు

HYDRA: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ కాలనీలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సుమారు 30 ఏళ్లుగా 20 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును కబ్జా చేసి.. ప్రహరీ గోడ నిర్మించారు కబ్జాదారులు. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా సీఐ మల్లేశ్వర్..సంఘటన స్థలానికి చేరుకొని ఆక్రమిత రోడ్డుపై నిర్మించిన ప్రహరీ గోడను తొలగించారు. ప్రహారీ గోడ తొలగింపుతో కాలనీలో రాకపోకలకు అడ్డంకులు తొలగి పోయాయంటున్నారు స్థానికులు. ప్రభుత్వ భూములు, రోడ్ల ఆక్రమణలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News