Hyderabad: హైదరాబాద్ శివారులో భారీగా గంజాయి పట్టివేత
Hyderabad: రూ.20 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేసిన ఎన్సీబీ * ఏపీ నుంచి రోడ్డు మార్గంలో కోల్‌కతాకు తరలిస్తున్న ముఠా
Hyderabad: హైదరాబాద్ శివారులో మొదటిసారి భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. 20 కోట్ల విలువైన గంజాయిని సీజ్ చేసింది ఎన్సీబీ. ఏపీ నుంచి కోల్‌కతాకు రోడ్డు మార్గంలో జీడిపప్పు బస్తాల మాటున గంజాయి తరలిస్తోంది ముఠా. సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు.. తనిఖీలు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గుజరాత్‌కు గంజాయి సరఫరా చేస్తున్నట్టు గుర్తించింది.