Asifabad: ఆసీఫాబాద్ జైనుర్ పెట్రోల్ బంక్‌లో వాహనదారుల అవస్థ – జనరేటర్ సౌకర్యం లేక ఇబ్బందులు
ఆసీఫాబాద్ జిల్లాలో వాహనదారులు అవస్తలు జైనూరు మండలంలోని ఐటీడీఏ పెట్రోల్ బంక్‌లో... గంటలతరబడి పెట్రోల్ కోసం ఎదురుచూపులు జనరేటర్ సౌకర్యం లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు
Asifabad: ఆసీఫాబాద్ జైనుర్ పెట్రోల్ బంక్‌లో వాహనదారుల అవస్థ – జనరేటర్ సౌకర్యం లేక ఇబ్బందులు
ఆసీఫాబాద్ జిల్లాలో వాహనదారులు అవస్తలు పడుతున్నారు. జైనూరు మండలంలోని ఐటీడీఏ పెట్రోల్ బంక్‌లో గంటలతరబడి పెట్రోల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఐటిడిఏ పెట్రోల్ పంపులో జనరేటర్ సౌకర్యం లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు ఆరోపించారు. కరెంటు పోయినప్పుడల్లా గంటల తరబడి పెట్రోల్ కోసం వేచి ఉండాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా జనరేటర్ సౌకర్యం కల్పించి 24 గంటల పాటు సేవలు అందించాలని వాహనదారులు కోరారు.
24 గంటల పాటు వాహనదారులకు అందుబాటులో ఉండి పెట్రోల్ అందించాల్సిన సౌకర్యాలు అందించడం లేదని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల వాహనదారులు తమ అవేదన వ్యక్తం చేశారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
జైనూర్ మండల కేంద్రంలోని ఐటిడిఏ పెట్రోల్ పంపులో జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
కరెంటు పోయినప్పుడల్లా గంటల తరబడి పెట్రోల్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం పెట్రోల్ కోసం వస్తే క్యూలైన్ లో గంటల తరబడి వేచి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు.
ఇప్పటికైనా జనరేటర్ సౌకర్యం కల్పించి 24 గంటల పాటు వాహనదారులకు సేవలు అందించాలని స్థానికులు కోరారు..