Hyderabad: హబ్సిగూడలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
Crime News: హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Hyderabad: హబ్సిగూడలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
Crime News: హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
మృతులు భర్త చంద్రశేఖర్‌రెడ్డి, భార్య కవిత, కూతురు శ్రీతరెడ్డి, కుమారుడు విశ్వన్‌రెడ్డిగా గుర్తించారు. మృతుడు చంద్రశేఖర్‌రెడ్డి గతంలో ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. అయితే.. ఆరు నెలలుగా ఉద్యోగం లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు సమాచారం. దీంతో.. ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.