RS Praveen Kumar: తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడిగా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar: ఆగస్టు 8న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరనున్నారు.
RS Praveen Kumar: తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడిగా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar: ఆగస్టు 8న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరనున్నారు. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు ఆయన. అనంతరం దళిత, బహుజన మేధావులతో ఆయన భేటీ కానున్నారు. ఇటీవల ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణలో బీఎస్పీ బలపడనున్నట్లు మాయావతి ప్రకటించారు. కాగా గతంలో కూడా బీఎస్పీ నుండి తెలంగాణకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. పార్టీ టికెట్ రాకపోవడంతో ప్రస్తుత మంత్రి ఐకేరెడ్డితో పాటు ఎమ్మెల్యే కోనప్పలు ఇద్దరు బీఎస్పీ నుండే టికెట్ సాధించి 2014 ఎన్నికల్లో గెలుపొందారు అనంతరం ఇద్దరు కూడా టీఆర్ఎస్‌లో విలీనం అయ్యారు.