అట‌వీ శాఖ కార్యాల‌యం వ‌ద్ద ఉద్యోగిపై దాడి..!

అటవీశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సూప‌రింటెండెంట్ రాజుపై.. మద్దిమడుగు ఛైర్మెన్ రాములు, అతని కుమారులు దాడి చేశారు.

Update: 2025-10-31 09:35 GMT

అటవీశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సూప‌రింటెండెంట్ రాజుపై.. మద్దిమడుగు ఛైర్మెన్ రాములు, అతని కుమారులు దాడి చేశారు. ఈ ఘటన నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది. మద్దిమడుగు ఛైర్మెన్ రాములు తనతో మాట్లాడాలని బయటికి పిలిచి.. విచక్షణారహితంగా దాడి చేశారని రాజు ఆరోపించాడు.

ఎందుకు కొడుతున్నారని అడిగినా, ఎలాంటి సమాధానం చెప్పాకుండా.. పది నిమిషాలు ఆగకుండా కొట్టి తన ఫోన్‌ ధ్వంసం చేశారని వాపోయాడు. తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజు పోలీసులను ఆశ్రయించాడు. కుటుంబ సమస్య కారణంగా దాడి జరిగినట్టు సమాచారం.

Tags:    

Similar News