గోల్కొండలో సివిట్‌ క్యాట్‌...

లాక్ డౌన్ కారణంగా ప్రజలు, వాహనాలు ఎక్కువగా రోడ్లపైకి రాకపోవడంతో అడవులు, జూపార్కులలోని జంతువులన్నీ రోడ్లపై, ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి.

Update: 2020-05-14 07:33 GMT
Forest Department Caught Civet Cat at Golconda

లాక్ డౌన్ కారణంగా ప్రజలు, వాహనాలు ఎక్కువగా రోడ్లపైకి రాకపోవడంతో అడవులు, జూపార్కులలోని జంతువులన్నీ రోడ్లపై, ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి. నెమలులు, చిరుతలు, జింకలు, కుందేళ్లు ఇలా జంతువులన్నీ కాలనీల బాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని గోల్కోండ వద్ద ఉన్న మసీదులోకి నలుపు రంగులోని ఓ పెద్ద పిల్లి వచ్చి చేరుకుంది. గోల్కొండలోని నూరానీ మసీదు సమీపంలోని ఫతే దర్వాజా వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక 2-3 గంటల సమయంలో పెద్ద పిల్లి కనిపించింది. అది గమనించిన స్థానికులు నల్ల చిరుత పులి వచ్చందంటూ భయాందోళన గురయ్యారు. దీంతో గత రాత్రి నుంచి గోల్కొండ ప్రాంతంలో బ్లాక్‌ పాంథర్‌ తిరుగుతోందంటూ ప్రచారం కొనసాగింది.

ఈ సమాచారాన్ని స్థానికులు, పోలీసులు అటవీశాక సిబ్బందికి ఇవ్వగా వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే మసీదు గేట్లను మూసివేశారు. ఎట్టకేలకు అటవీశాఖ సిబ్బంధి మానుపిల్లిని పట్టుకున్నారు. ఆ తరువాత దాన్ని ప్రాథమికంగా పరిశీలించి అది పెద్ద పిల్లిగా తేల్చారు. తగిన రక్షణ చర్యలు తీసుకుని మానుపిల్లిని జూపార్క్‌కు తరలించినట్లు తెలిపారు. తెలంగాణలో నల్ల చిరుత లేదని, స్థానికులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.


Tags:    

Similar News