Football Fever in Hyderabad: మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్‌కు సీఎం రేవంత్ రెడీ.. హైదరాబాద్‌లో రేపే మెస్సీ మ్యాచ్
Football Fever in Hyderabad: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.
Football Fever in Hyderabad: మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్‌కు సీఎం రేవంత్ రెడీ.. హైదరాబాద్‌లో రేపే మెస్సీ మ్యాచ్
Football Fever in Hyderabad: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఫుట్ బాల్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కీలక మ్యాచ్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రేపు జరగనుంది. ఈ కీలక మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 39 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియాన్ని నాలుగు సెక్టార్లుగా విభజించారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఫుట్బాల్అభిమానులకు పండగే పండగ. ఎందుకంటే ఫుట్‌బాల్ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడబోతున్నాడు. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్. దీంతో ఫుట్ బాల్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెస్సీ గోట్ ఇండియా టూర్ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ మ్యాచ్‌లో మెస్సీ, సీఎం రేవంత్‌రెడ్డి, అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. మెస్సీ పర్యటన, ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు మెస్సీ శంషాబాద్‌విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మ్యూజికల్కాన్సెర్ట్ ఉంటుంది. రాత్రి 7 గంటలకు చిన్నారులకు మెస్సీ ఫుట్‌బాల్ ట్రైనింగ్ ఇస్తారు. అనంతరం, మెస్సీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది.
ఒక్క ఉప్పల్ స్టేడియంలోనే రాచకొండ పోలీసులు సుమారు 2వేల మందితో బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి అదనంగా స్టేడియం లోపల వెయ్యి మంది వాలంటీర్లు విధుల్లో ఉండనున్నారు. ఉప్పల్‌స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు టికెట్లు, పాస్‌లు ఉన్నవారు మాత్రమే స్టేడియం దగ్గరకు రావాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. లేనివారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమన్నారు. స్టేడియం దగ్గర రద్దీకి అవకాశం లేకుండా అభిమానులు సహకరించాలని తెలిపారు.
మెస్సీ పరేడ్ చేయడంతో పాటు పెనాల్టీ స్ట్రోక్కూడా ప్రదర్శిస్తాడు. చివరగా మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు గోట్కప్ను మెస్సీ అందజేస్తాడు. మెస్సీ పర్యటన, సీఎం రేవంత్ రెడ్డి ఈమ్యాచ్ లో పాల్గొనడంతో హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని, రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడకు ప్రోత్సాహం లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.