Corruption In Telangana : మెదక్ అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో సహా ఐదుగ్గురు అరెస్ట్

Update: 2020-09-10 05:23 GMT

Corruption In Telangana : మెదక్ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతూన్నాయి. ఆర్డీవో అరుణా రెడ్డి, ఎమ్మార్వో అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసిమ్ హైమ్మద్,జీవన్ గౌడ్ లను అరెస్ట్ చేసి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఏసీబీ అధికారులు తీసుకొచ్చారు. వారితో పాటు మరికొద్ది సేపట్లో మెదక్ ఇంచార్జ్ కలెక్టర్ నగేష్ ను ఏసీబీ కార్యాలయానికి తీసుకు రానున్నారు. ఏసీబీ అధికారులు నగేష్ ఇంట్లో జరిపిన సోదాల్లో భూ డాక్యుమెంట్లు, బినామి పేర్ల మీద ఆస్తులను గుర్తించారు. వీఆర్ఓ , విఆర్ఏ పాత్ర పై ఆరా తీస్తున్నారు. అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులకు నేడు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్ట్ లో ప్రవేశ పెట్టనున్నారు.

112 ఎకరాల విస్తీర్ణంలో భూమి NOC ఇవ్వడం కోసం మెదక్ అడిషనల్ కలెక్టర్ లంచం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఎకరాకు లక్ష చొప్పున 1 కోటీ12లక్షలు లంచం డిమాండ్ చేసారు. మొదటగా రెండువిడతల్లో 19.5 లక్షలు, మరో సారి 20.5 లక్షలు లంచంను అడిషనల్ కలెక్టర్ నగేష్ తీసుకున్నారు. మిగిలిన 72 లక్షలకు గాను 5 ఎకరాల భూమిని నగేష్ బినామీ జీవన్ గౌడ్ కి సేల్ అగ్రిమెంట్ చేయాలని తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ అయ్యేవరకు షూరిటీ కోసం బాధితుడు నుండి 8 ఖాళీ చెక్కులను అడిషనల్ కలెక్టర్ తీసుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్ ఫిర్యాదుదారు నుండి 5 లక్షలు వసూలు చేసారు. ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో సోదాలు చేసి 28 లక్షలు నగదు, అర కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. నగేష్ ఇంట్లో కీలకమైన అగ్రిమెంట్ సెల్ డాక్యుమెంట్స్, చెక్స్ స్వాధీనం ఈరోజు బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయనున్నారు.

ఆడియో టేపులతో సహా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. మెదక్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఆర్డీవో అరుణరెడ్డి, ఎమ్మెర్వో సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వహీమ్, నగేష్ బినామీ కొళ జీవన్ గౌడ్ అరెస్ట్ చేసి వైద్యపరీక్షలు అనంతరం కోర్ట్ కు తరలించనున్నారు. రెవెన్యూ శాఖలో ఇంత పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు లేవు. అరెస్ట్ ఐనా వారిలో భారీగా అక్రమ ఆస్తులు కల్గి ఉన్నారని సమాచారం. అరెస్ట్ ఐనా వారిలో కోట్ల రూపాయల ఆస్తులు ల్యాండ్ ప్లాట్స్ కొనుగులు చేసారు. బంగారం పేదల భూ వివాదాస్పద డ్యాకుమెంట్లు ఉన్నట్లు సమాచారం. వీరు ఉద్యోగంలొ చేరక ముందు ఉన్న ఆస్తులు, ఇప్పటి ఆస్తులు పొంతన లేదని సమాచారం. వేల కోట్లు ఆస్తులు సంపాదించడం నేర్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Tags:    

Similar News