నర్సాపూర్ ఆర్డీఓ ఇంట్లో రూ .28 లక్షల నగదు

నర్సాపూర్ ఆర్డీఓ ఇంట్లో రూ .28 లక్షల నగదు
x
Highlights

నర్సాపూర్ ఆర్డీఓ అరుణా రెడ్డి నివాసం నుంచి అవినీతి నిరోధక శాఖ అధికారులు రూ .28 లక్షలను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లాలోని 12 మంది...

నర్సాపూర్ ఆర్డీఓ అరుణా రెడ్డి నివాసం నుంచి అవినీతి నిరోధక శాఖ అధికారులు రూ .28 లక్షలను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లాలోని 12 మంది రెవెన్యూ అధికారుల నివాసాల వద్ద ఎసిబి దాడులు నిర్వహిస్తోన క్రమంలో ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్డిఓ నివాసంలో నగదును కనుగొన్నారు. ఒక భూస్వామి నుంచి మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ రూ .1.12 కోట్లు డిమాండ్ చేస్తూ ఏసీబీ వలలో చిక్కిన తరువాత ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో సంగారెడ్డి ఎసీబీ డీఎస్పీ సూర్యనారాయణ నాయకత్వం వహిస్తున్నారు.

మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ నర్సపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్‌వోసీ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. దాని కోసం ఏకంగా రూ.కోటి 40 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ తరువాత కాసేపు మాట్లాడుకుని ఎకరాకు లక్ష చొప్పున ఇవ్వాలంటూ రూ.కోటి 12 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే పూర్తి మొత్తం నగదు కాకుండా తన పేరిట రూ.72 లక్షల విలువైన భూములు రిజిస్ట్రేషన్‌ చేయాలని, రూ.40 లక్షల నగదు ఇవ్వాలని కోరారు. కాగా అందులో భాగంగానే రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఆడియో క్లిప్‌ను కూడా సమర్పించిన మూర్తి ఫిర్యాదు ఆధారంగా ఎసిబి అధికారులు 12 మంది రెవెన్యూ అధికారుల ఇళ్లపై దాడి చేశారు. అధికారులు నాగేష్ ఇంటి నుంచి రూ. లక్షను, ఇతర ఆస్తి పత్రాలను, బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా జాయింట్ కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవో బండారు అరుణా రెడ్డి, ఎమ్మార్వో సత్తార్, విఆర్వో, విఆర్ఏ,జూనియర్ అసిస్టెంట్‌ల నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.




Show Full Article
Print Article
Next Story
More Stories