ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ తనిఖీలు..

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ తనిఖీలు..
x
Highlights

ACB Sleuths: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఏకకాలంలో అన్ని తహసీల్దార్‌,...

ACB Sleuths: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఏకకాలంలో అన్ని తహసీల్దార్‌, మున్సిపాలిటీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో సోదాలు చేసిన అధికారులు.. తహశీల్దార్ చంద్రశేఖర్ కారులో రూ.రెండు లక్షలు, డిప్యూటీ తహశీల్దార్ కారులో రూ.లక్ష స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారించారు.

అదేవిధంగా అనంతపురం జిల్లా కూడేరు తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. పలు దస్త్రాలను క్షుణ్నంగా పరిశీలించి భూ రికార్డులకు సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్‌ను ప్రశ్నించారు. విశాఖ జిల్లా కశింకోట, విజయనగరం జిల్లా బలిజిపేట, శ్రీకాకుళం జిల్లా సంతకవిటి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రెవెన్యూ కార్యాయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మరోవైపు పలువురు రైతుల ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా రాజుపాలెం తహశీల్దార్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు.


Show Full Article
Print Article
Next Story
More Stories