Hyderbad: సికిం‍ద్రాబాద్‌ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం

Secunderabad Club: చారిత్రాత్మక సికింద్రాబాద్‌ క్లబ్‌ అగ్నికి ఆహుతైంది. తెల్లవారుజామున క్లబ్‌లో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది.

Update: 2022-01-16 04:30 GMT

Hyderbad: సికిం‍ద్రాబాద్‌ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం

Secunderabad Club: చారిత్రాత్మక సికింద్రాబాద్‌ క్లబ్‌ అగ్నికి ఆహుతైంది. తెల్లవారుజామున క్లబ్‌లో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న 10 ఫైర్ ఇంజన్లు దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష‌్టం సంభవించినప్పటికీ సుమారు 20 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

సంక్రాంతి సందర్భంగా నిన్న క్లబ్‌ తెరవకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. క్లబ్‌లో అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. క్లబ్ ముందు భాగం కలప, చెక్కతో నిర్మించారు. దీంతో మంటలు ఈ స్థాయిలో వ్యాపించాయి. హెరిటేజ్ బిల్డింగ్‌తో పాటు బార్ మొత్తం ప్రమాదంలో కాలిపోయింది.

బ్రిటీష్‌ హయాంలో మిలిటరీ అధికారుల కోసం 1878లో క్లబ్‌ను నిర్మించారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. ఈ క్లబ్‌ను భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో పోస్టల్‌ కవర్‌ కూడా విడుదల చేశారు. ఈ క్లబ్‌లో దాదాపు 300 మంది సిబ్బంది పని చేస్తున్నారు. క్లబ్‌లో 4వేల మందికిపైగా సభ్యత్వం ఉంది. 24 ఎకరాల్లో క్లబ్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

Full View


Tags:    

Similar News