Secunderabad: సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఓ లాడ్జిలోని వంట గదిలో చెలరేగిన మంటలు

Secunderabad: మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

Update: 2023-07-02 08:08 GMT

Secunderabad: సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఓ లాడ్జిలోని వంట గదిలో చెలరేగిన మంటలు

Secunderabad: సికింద్రాబాద్‌ రెజిమెంటల్ బజార్‌లోని ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దేవి హోటల్‌లోని కిచెన్ రూమ్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా పొగలు అలుముకోవడంతో పై అంతస్తులో లాడ్జ్‌లో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యాంగ హోటల్ ఏర్పాటు చేయడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారని... వెంటనే అధికారులు అనుమతి లేని లాడ్జింగ్‌లపై, హోటల్స్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు  డిమాండ్ చేశారు.

Tags:    

Similar News