Khammam: కన్నపిల్లలను చంపేసిన తండ్రి.. ఇంట్లో భార్యాభర్తల గొడవలతో ఫ్రస్టేషన్

Khammam: చనిపోయిన పిల్లలను దుప్పట్లో చుట్టి పరారీ

Update: 2023-07-11 03:23 GMT

Khammam: కన్నపిల్లలను చంపేసిన తండ్రి.. ఇంట్లో భార్యాభర్తల గొడవలతో ఫ్రస్టేషన్

Khammam: కన్నబిడ్డల ఆలనా పాలనా చూసుకోవాల్సన తండ్రి కాలయముడయ్యాడు. పెంచిపోషించాల్సిన తండ్రి కర్కశంగా వ్యవహించాడు. భార్యపైకోపంతో ఆవేశాన్ని పెంచుకున్న దుర్మార్గుడు కన్నబిడ్డల ఉసురుతీశాడు. ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న తండ్రి బిడ్డల గొంతునులిమి చంపేశాడు. ఏసుమణి, శివరాంగోపాల్ దంపతులు తరచూ గొడవపడుతుండేవారు. కుటుంబ కలహాలతో ఫ్రస్టేషన్లో ఉన్న శివరాంగోపాల్ కన్నబిడ్డల ప్రాణాలుతీసేందుకు ఒడిగట్టాడు. స్కూలుకెళ్లిన చిన్నారులను తీసుకొచ్చి చంపి దుప్పట్లో మూటగట్టి పరారయ్యాడు. పిల్లలు కన్పించలేదని గాలించిన తల్లి ఏసుమణి, దప్పట్లో చిన్నారుల మృతదేహాలను చూసి తల్లడిల్లిపోయారు. శివరాం గోపాల్ నేరపూరిత కేసుల్లో జైలు శిక్ష అనుభవించి ఇటీవల బయటకొచ్చినట్లు సమాచారం.

Tags:    

Similar News