Hyderabad: బైక్ పై నుంచి జారిపడిన తండ్రి కూతురు.. ఢీ కొట్టిన డీసీఎం
Road Accident: సికింద్రాబాద్ బోయినపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Hyderabad: బైక్ పై నుంచి జారిపడిన తండ్రి కూతురు.. ఢీ కొట్టిన డీసీఎం
Road Accident: సికింద్రాబాద్ బోయినపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో తండ్రి, కుమార్తె కిందపడ్డారు. ఈక్రమంలో వీరి బైక్‌ను వెనక నుంచి వచ్చిన డీసీఎం వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రితో పాటు కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. కూతురు వైష్ణవి పరిస్థితి విషమంగా ఉండటంతో...గాయపడ్డవారిని స్థానిక రష్ ఆసుపత్రికి తరలించారు. MNR కాలేజ్‌లో వైష్ణవి డిగ్రీ చదవుతోంది. కాలేజీ బస్సు ఎక్కించేందుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.