Adilabad: ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు రైతుల ఆందోళన
Adilabad: పత్తి క్వింటాలుకు రూ.15వేలు చెల్లించాలని డిమాండ్
Adilabad: ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు రైతుల ఆందోళన
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. పత్తికి క్వింటాలుకు 15వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ మాట్లాడుతూ రైతులు ఆరు గాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫలమయ్యాయని ఆరోపించారు. వాణిజ్య కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ కి అనుమతి ఉన్న ఎందుకు పత్తిని కొనడం లేదని ప్రశ్నించారు.