Nagarkurnool: మద్దతు ధర కల్పించాలి.. వేరుశనగ రైతుల ధర్నా
Nagarkurnool: మార్కెట్ యార్డ్ ఎదుట నిరసనకు దిగిన రైతులు
Nagarkurnool: మద్దతు ధర కల్పించాలి.. వేరుశనగ రైతుల ధర్నా
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మార్కెట్ యార్డు ముందు వేరుశనగ రైతులు మరోసారి ధర్నా చేపట్టారు. మద్దతు ధర పెంపు హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న మార్కెట్ కార్యాలయంపై వేరుశనగ రైతులు దాడికి పాల్పడగా.. మార్కెట్ ఛైర్‌పర్సన్‌ను కార్యాలయం నుంచి ఈడ్చుకెళ్లిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మరోసారి వేరుశనగ రైతులు నిరసనకు దిగారు.