Rythu Bharosa: అకౌంట్లలో జమ అవుతున్న రైతు భరోసా నగదు.. ఈరోజు బ్యాంకుల నుంచి తీసుకోవచ్చు: తుమ్మల

Update: 2025-01-27 01:23 GMT

 Rythu Bharosa: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారందరికీ త్వరలోనే రైతు భరోసా..!!

Rythu Bharosa: ఈ సంవత్సరం రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ. 12వేలు ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రెండు విడతలుగా రూ. 12వేలు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. రైతులకు యాసంగికి పెట్టుబడి సాయం, కూలీలకు రూ. 6వేలు ఆదివారం అర్ధరాత్రి నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని వివరించారు. సోమవారం నుంచి బ్యాంకుల్లో నగదు తీసుకోవచ్చని తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మల్లేపల్లిలో ప్రజాపాలన గ్రామసభలో మంత్రి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల పథకాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా రూ. 2లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. అందుకు రూ. 21వేల కోట్లు చెల్లించామని ప్రకటించారు. పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని మంత్రి తెలిపారు. అర్హులైన అందరికీ పథకాలు వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి 3,500 ఇళ్లు మంజూరవుతాయని..ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ఇస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, తోపాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News