Gangadhara: వైభవంగా సాగిన స్వామివారి రథయాత్ర

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుభూత్కూర్ గ్రామంలో శ్రీ రాములవారి రథోత్సవం కన్నులపండువగా జరిగింది.

Update: 2026-04-03 09:59 GMT

Gangadhara: వైభవంగా సాగిన స్వామివారి రథయాత్ర

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుభూత్కూర్ గ్రామంలో శ్రీ రాములవారి రథోత్సవం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం అంతా పండుగ వాతావరణంలోమునిగిపోయింది. శ్రీరాముని రథాన్ని అలంకరించి గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించగా, భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్కాపురం రాజీశ్వరి, రాజేశం గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని రథోత్సవాన్ని ప్రారంభించారు. గ్రామ ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు కుల పెద్దలు పాల్గొని ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు హారతులు సమర్పిస్తూ జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News