Kamareddy: వరికి మొలకలు..త్వరగా కొనుగోలు చేయాలని వేడుకోలు

*కామారెడ్డి వరి రైతుల దైన్యస్ధితి *వర్షాలకు రంగుమారిన ధాన్యం *ఆరబోసిన ధాన్యానికి జల్లుల దడ

Update: 2021-11-20 04:51 GMT

కామారెడ్డి వరి రైతుల దైన్యస్ధితి(ఫైల్ ఫోటో)

Kamareddy: వర్షాలకు కామారెడ్డి జిల్లా రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రెండుసార్లు పంట వర్షార్పణం కాగా మళ్లీ వర్ష సూచన ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ పాటికే అమ్మకానికి తెచ్చిన ధాన్యం సగానికి పైగా నీటిలో కొట్టుకుపోగా ఉన్న పంట రంగు మారడం, మొలకలు రావడంతో దిక్క తోచని స్ధితిలో ఆవేదన చెందుతున్నారు.

మార్కెట్లు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యానికి జల్లుల దడ పట్టుకుంది. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని తమకు ఆదుకోవాలని కామారెడ్డి జిల్లా రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కామారెడ్డి జిల్లా వరి రైతులు కోరుతున్నారు. 

Full View


Tags:    

Similar News