Kamareddy: మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌ రద్దు కోరుతూ ఇవాళ మున్సిపల్‌ ఆఫీస్‌ దగ్గర రైతుల ధర్నా

Kamareddy: హైకోర్టులో నేడు రామేశ్వర్‌పల్లి గ్రామస్తుల పిటిషన్‌ విచారణ

Update: 2023-01-11 03:33 GMT

Kamareddy: మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌ రద్దు కోరుతూ ఇవాళ మున్సిపల్‌ ఆఫీస్‌ దగ్గర రైతుల ధర్నా

Kamareddy: కామారెడ్డిలో మళ్లీ రైతులు ఆందోళన బాట పట్టనున్నారు. మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌ రద్దు కోరుతూ ఇవాళ మున్సిపల్‌ ఆఫీస్‌ దగ్గర రైతులు ధర్నాకు దిగుతున్నారు. మాస్టర్‌ప్లాన్‌ రద్దు కోసం మున్సిపల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ కోరుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణ హైకోర్టులో నేడు రామేశ్వర్‌పల్లి గ్రామస్తుల పిటిషన్‌ విచారణకు రానుంది. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించనున్నారు. మరోవైపు ఇవాళ్టితో కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌ అభ్యంతరాల గడువు ముగియనుంది. ఇప్పటివరకు అధికారికంగా వెయ్యి 50 అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 

Tags:    

Similar News