Vangoor: పోతిరెడ్డిపల్లి గ్రామంలో కంటి వైద్య శిబిరం

మండల పరిధిలోని పోతిరెడ్డి పల్లి గ్రామంలో, శనివారం ఎల్.వి.ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

Update: 2020-03-15 05:18 GMT
Eye Medical Camp in Pothireddy Palli

వంగూరు:మండల పరిధిలోని పోతిరెడ్డి పల్లి గ్రామంలో, శనివారం ఎల్.వి.ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ చిలుక శ్రీనివాస్ రెడ్డి హాజరై, కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలో కంటి చూపుకు ఇబ్బంది అవుతున్నా వృద్ధులు వెళ్లి చూపించుకున్నారు.

గ్రామంలో కంటి ఆపరేషన్లు అవసరమైన వారు పది మంది ఉన్నట్లు వారు తెలిపారు.రేపు నాగర్ కర్నూలు జిల్లా తూడుకుర్తి గ్రామంలో వీరికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో డాక్టర్ వెంకటయ్య శ్రీదేవి, లక్ష్మి, గ్రామ ప్రజలు శ్రీశైలం, నరేష్, శ్రీనివాస్, వెంకటయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.



Tags:    

Similar News