KCR: ముస్లింలకు మాజీ సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు

KCR: నెల రోజుల పాటు జరిగిన రంజాన్‌ ఉపవాస దీక్షలతో.. తెలంగాణ వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నింపాయి

Update: 2024-04-11 02:31 GMT

KCR: ముస్లింలకు మాజీ సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు

KCR: ముస్లిం సోదర సోదరీమణులకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈద్‌ ఉల్‌ ఫితర్‌ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు జరిగిన రంజాన్‌ ఉపవాస దీక్షలు, పేదలకు సంతర్పన కార్యాలతో తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయని అన్నారు.

తమ పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, సర్వమతాల సమాహారంగా, గంగా జమునా తెహజీబ్‌కు ఆలవాలంగా నెలకొల్పామని కేసీఆర్‌ అన్నారు. లౌకికవాద సాంప్రదాయాలను పాటిస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టామని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.

Tags:    

Similar News