మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నటుడు కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆయన బుధవారం బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. ఐసీయులో ఉంచి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరో గ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన కొద్దిరోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు.