Ramchander Rao: ఎవరైనా పార్టీ పెట్టొచ్చు.. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు
Ramchander Rao: కవిత కొత్త పార్టీ ప్రకటనపై స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు.
Ramchander Rao: ఎవరైనా పార్టీ పెట్టొచ్చు.. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు
Ramchander Rao: కవిత కొత్త పార్టీ ప్రకటనపై స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు. ఎవరైనా పార్టీ పెట్టొచ్చు.. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని అన్నారు. అయితే బీఆర్‌ఎస్ అవినీతి, అక్రమాలను కవిత బయటపెట్టాలని.. దీనిపై రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆమె ఆత్మగౌరవం ఎలా దెబ్బతిందో వాళ్ల కుటుంబ అంశమని.. పార్టీ పెట్టడం వల్ల తమకు వచ్చే నష్టం ఏమి లేదని అన్నారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. కవిత తప్పు చేసింది కాబట్టే జైలుకు వెళ్లిందని తెలిపారు. బీజేపీ కక్ష పూరిత రాజకీయాలు చేయదని.. అలాంటి రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పుకొచ్చారు.