Etela Rajender: అసైన్డ్ భూముల వ్యవహారం కేసు ముమ్మరం

Etela Rajender: మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు

Update: 2021-05-17 12:32 GMT

ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా కేసు విచారణను ఏసీబీ అధికారులు ముమ్మరం చేశారు. జమున హెచరీస్ కంపెనీ నిర్మాణం కోసం 2018లో ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఇంచార్జ్ తహసీల్దార్ సురేష్, మాలతి తెలిపారు. హకీంపేట 111 సర్వేనెంబర్‌లో అనుమతి లేకుండా షెడ్ల నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. దీనిపై పంచాయతీ సెక్రటరీ రెండుసార్లు నోటీసు ఇచ్చారని వారు తెలిపారు. 40 ఎకరాలలో అక్రమ నిర్మాణం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాల ప్రకారం విచారణ చేపడుతున్నామన్నారు. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి అనుమతులు పొందినట్టుగా ప్రాథమిక విచారణలో తేలిందని ఇంచార్జ్ తహశీల్దార్లు పేర్కొన్నారు.

మరోవైపు మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్, విజిలెన్స్ అధికారులు మాసాయిపేటకు వచ్చారు. అలాగే విజిలెన్స్ ఎస్పీ మనోహర్ సైతం ఏసీబీ కార్యాలయంలో విచారణలో పాల్గొన్నారు.

Tags:    

Similar News