Hyderabad: ఖైరతాబాద్‌లో విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా..రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..
Hyderabad: పీఆర్‌సీ అనేది మా హక్కు.. ప్రభుత్వాలు ఊరికే ఇవ్వడం లేదు
Hyderabad: ఖైరతాబాద్‌లో విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా
Hyderabad: హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమస్యల పరిష్కారానికి విద్యుత్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఏడాది క్రితం పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ తమకేం ఊరికే ఇవ్వడం లేదని.. పీఆర్సీ అనేది మా హక్కు అంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వానికి మేం వ్యతిరేకంగా కాదని..తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ సౌధ దగ్గర చేపట్టిన ఈ ధర్నాకు భారీగా విద్యుత్ ఉద్యోగులు తరలివచ్చారు. దీంతో అక్కడ రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.