హైదరాబాద్ కార్ఖానాలో కలర్స్ సంస్థ దారుణం.. వెయిట్ లాస్ పేరుతో కరెంట్ షాక్‌లు
Hyderabad: ఆస్పత్రిపాలైన యువతి
హైదరాబాద్ కార్ఖానాలో కలర్స్ సంస్థ దారుణం.. వెయిట్ లాస్ పేరుతో కరెంట్ షాక్‌లు
Hyderabad: బరువు తగ్గాలని చాలామంది పురుషులు మహిళలు స్లిమ్మింగ్ సెంటర్లో చుట్టూ తిరగటం సహజమే. అయితే కొన్ని స్లిమ్మింగ్ సెంటర్లు బరువు తగ్గాలనే ఆశ ఉన్న వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అంతేకాదు వారి బరువును అసహజ పద్ధతుల్లో తగ్గిస్తామని హామీ ఇస్తూ తమ క్లైంట్లను ఆసుపత్రిపాలయ్యేలా చేస్తున్నారు. తాజాగా హైదరాబాదులోని కార్ఖానాలో ఓ స్లిమ్మింగ్ సెంటర్ చేసిన పనికి యువతి ప్రాణాల మీదకు వచ్చింది. వెయిట్ లాస్ పేరుతో కరెంట్ షాకులు ఇవ్వడంతో సికింద్రాబాద్ కార్ఖానాకి చెందిన మహేశ్వరి ఆసుపత్రి పాలయ్యింది.
సికింద్రాబాద్ కార్ఖానాకు చెందిన మహేశ్వరి 81 కేజులు బరువు ఉటుంది. టీవీల్లో, సోషల్ మీడియాలో యాడ్స్ చూసి ఆకర్షితురాలైన మహేశ్వరి కలర్స్ సంస్థను ఆశ్రయించింది. 15 కేజీల బరువు తగ్గిస్తామని చెప్పడంతో అక్కడ చేరింది. వెయిట్ లాస్ పేరుతో కలర్స్ సంస్థ మహేశ్వరికి కరెంట్ షాక్ లు ఇవ్వడంతో ఆమె అనారోగ్యానికి గురై ఆస్పత్రిపాలైంది. కలర్స్ సంస్థను మూసివేయాలని మహేశ్వరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.