Vijayareddy: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
Vijayareddy: పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు
Vijayareddy: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
Vijayareddy: ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పంజాగుట్ట, ద్వారకాపురికాలనీ, రామకృష్ణ నగర్‌లో విజయారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజలు దివంగత నేత పీజేఆర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారని విజయారెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను గుర్తు పెట్టుకుని ఎమ్మె్ల్యేగా తనకు అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగి పోయారన్న ఆమె... ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.