నేటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం
Revanth Reddy: నేడు నారాయణపేటలో కాంగ్రెస్ జనగర్జన సభ
Revanth Reddy, Congress, Election Campaign
Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనగర్జన సభ జరగనుంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానున్న సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో సభ జరగనుంది. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
హెలికాప్టర్ ద్వారా నారాయణపేట చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి... రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. సొంత జిల్లా కావడం, కొడంగల్ నియోజకవర్గం మహబూబ్‌నగర్ పరిధిలో ఉండడంతో.. ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోస్గిలో నిర్వహించిన సభలోనే మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్‌రెడ్డి పేరును స్వయంగా రేవంతే ప్రకటించారు.