CM KCR: నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం
CM KCR: మేనిఫెస్టో ప్రకటించి ప్రజల్లోకి గులాబీ బాస్
CM KCR: నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం
CM KCR: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తమ మేనిఫెస్టోలను ప్రకటించి... ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి పార్టీలు. ఇక తెలంగాణ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ ఎప్పటిలాగే... తన మార్క్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే దాదాపు 20 నియోజకవర్గాలను చుట్టేసిన సీఎం కేసీఆర్ ఇవాళ... మరో మూడు నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం హుజూర్‌నగర్, మధ్యాహ్నం మూడు గంటలకు మిర్యాలగూడ, సాయంత్రం నాలుగు గంటలకు దేవరకొండలో ప్రసంగించనున్నారు సీఎం కేసీఆర్.