తెలంగాణలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానంలో ఎన్నికకు ఈసీ కసరత్తు
Telangana: ఈ మేరకు షెడ్యూల్ రిలీజ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
తెలంగాణలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానంలో ఎన్నికకు ఈసీ కసరత్తు
Telangana: తెలంగాణ శాసనమండలిలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ స్థానం నుంచి ఎంపికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగాం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేడయంతో ఆ స్థానం ఖాళీ అయింది. అందుకు అనుగుణంగా ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 6 వరకు పట్టభద్రులు తమ ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈసీ షెడ్యూల్‌లో తెలిపింది. ఇందుకోసం ఫిబ్రవరి 24న ముసాయిదా జాబితా ప్రకటించనుండగా.. మార్చి 14 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 4న ఫైనల్ జాబితాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.