Earthquake: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు
Earthquake: ఒక్కసారిగా కంపించిన ఇళ్లు, ఉలిక్కిపడిన ప్రజలు
Earthquake: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు
Earthquake: భద్రాద్రి కొత్తగూడెంజిల్లా మణుగూరులో ఇవాళ తెల్లవారుజామున ఉదయం 4 గంటల 40 నిమిషాలకు స్వల్పంగా భూమి కంపించింది. పాత మణుగూరు, శేషగిరి నగర్, బాపన కుంట, శివలింగాపురం, విట్టల్ రావు నగర్, రాజుపేట ప్రాంతంలో భూమి కంపించింది. ఒక్కసారిగా వచ్చిన భూ ప్రకంపనలతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే మణుగూరులో భూక్రపంనలు రావడం ఇది మూడోసారి అంటూ స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఆగష్టు 25న తెల్లవారుజామున నమోదైన భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. భూకంప కేంద్రం 30 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకటించింది.