Yadadri: యాదాద్రి ఆలయంపై డ్రోన్ కలకలం
Yadadri: డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న సీఆర్పీఎఫ్ అధికారులు
Yadadri: యాదాద్రి ఆలయంపై డ్రోన్ కలకలం
Yadadri Temple: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహా స్వామివారి ఆలయంలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. అనుమతి లేకుండా యాదాద్రి ఆలయాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరిస్తున్న విషయాన్ని గుర్తించిన ఆలయ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ ద్వారా ఆలయాన్ని ఎందుకు చిత్రీకరిస్తున్నారు ఎవరి అనుమతితో ఇలా చేశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.