దిశ నిందితుల మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయి: డాక్టర్ శ్రవణ్

Update: 2019-12-21 06:42 GMT

దిశ ఎన్‌కౌంటర్‌ భూటమకంటూ ధాఖలైన పిటీషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో కోర్టుకు హాజరైన గాంధీ సూపరిండెంట్ శ్రావణ్ మృతదేహాల పరిస్దితిపై కోర్టుకు వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు మృతదేహాలు 50 శాత డీ కంపోజ్ అయ్యాయన్న ఆయన మరో వారం జరిగితే పూర్తిగా డీ కంపోజ్ అవుతాయంటూ తెలియజేశారు. మైనస్ 4 డిగ్రీల ఉష్ణోగ్రతలో మృతదేహాలను ఉంచామంటూ న్యాయమూర్తికి తెలియజేశారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి మృతదేహాలను భద్రపరిచేందుకు దేశంలో ఎక్కడైనా వసతులు ఉన్నాయా ? అంటూ ప్రశ్నించారు. తనకు తెలియదంటూ గాంధీ సూపరిండెంట్ శ్రావణ్ సమాధానమిచ్చారు. మరికాసేపట్లో మృతదేహాల అప్పగింత లేదా తరలింపు విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది.

Tags:    

Similar News