TSRTC: త్వరలోనే నగర రోడ్లపై పరుగులు పెట్టనున్న డబుల్ డెక్కర్ బస్సులు

TSRTC: మొదటి విడతగా రానున్న 10 డబుల్ డెక్కర్ బస్సులు

Update: 2023-01-19 04:34 GMT

TSRTC: త్వరలోనే నగర రోడ్లపై పరుగులు పెట్టనున్న డబుల్ డెక్కర్ బస్సులు

TSRTC: గతంలో మంత్రి కేటీఆర్ ఓ వ్యక్తి ట్వీట్‌కు స్పందిస్తూ తన చిన్నతనంలో నగర రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించానని తెలిపారు. ఇప్పుడు కూడా డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశ పెడితే బాగుంటదని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు రవాణాశాఖ మంత్రి పువ్వాడ నాగేశ్వర్ రావు సైతం డబుల్ డెక్కర్ బస్సులు నడిపించడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించారు సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఏ ఏ రూట్లలో నడిపితే బాగుంటుందని అధ్యయనం చేశారు. మెట్రో పాలిటన్ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ప్రయాణికుల కోసం డబుల్ డెక్కర్ బస్సులు రాబోతున్నాయి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడంతో పాటు ఆక్యుపెన్సీని పెంచేందుకు టీఎస్ ఆర్టీసీ ఈ దిశగా అడుగులు వేస్తోంది.

తొలిదశలో ప్రయోగాత్మకంగా సిటీకి 10 డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని అనువైన ప్రాంతాల్లో తొలుత వీటిని నడుపుతారు. ఆ తర్వాత మరిన్ని బస్సులను హైదరాబాద్‌లో నడపడంతో పాటు రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణాల్లోనూ వీటిని ప్రవేశ పెడతారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల కోసం టీఎస్ ఆర్టీసీ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పలు రకాల బస్సులనూ నడుపుతోంది. అయితే గతంలో డబుల్ డెక్కర్ బస్సులు నడిపిన సమయంలో నగరంలో ఫ్లై ఓవర్లు లేకపోవడంతో ప్రయాణం సాఫీగా సాగిపోయేది.. కానీ ఇప్పుడు నగరంలో ఎక్కడికక్కడ ఫ్లై ఓవర్లు ఉన్నాయి. ఫ్లై ఓవర్లు లేని రూట్లలోనే డబుల్ డెక్కర్ బస్సులు నడిపించనున్నారు

కొత్తగా ప్రవేశపెట్టే 10 డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కువగా సికింద్రాబాద్ - మేడ్చల్, సికింద్రాబాద్ - పఠాన్‌చెరు, సికింద్రాబాద్ - లింగంపల్లి, అఫ్జల్‌గంజ్ - మెహదీపట్నం, పటాన్‌చెరు - కోఠి మధ్య నడిపించనున్నారు. మొదటి దశలో 10 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు వచ్చే నెలలోనే నగర ప్రజలను కనువిందు చేయనున్నాయి ఇప్పటికే ఆర్టీసీ సంస్కరణల్లో భాగంగా భారీ నష్టాలను తగ్గించుకొని కొత్త బస్సుల కొనుగోలుపై దృష్టి సారించింది మొత్తం 1,024 బస్సుల్లో మొదటి దశలో 300 బస్సులు ప్రవేశ పెట్టనున్నారు అందులో ఇప్పటికే 51 సూపర్ లగ్జరీ బస్సులను ప్రారభించారు ఇక డబుల్ డెక్కర్ బస్సులపైనే టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఫోకస్ చేసింది.

Tags:    

Similar News