Telangana: ఆవు దూడకు పాలు ఇచ్చిన శునకం
Telangana: ఓ ఆవు దూడకు తల్లిగా మారిన శునకం
Representational Image
Telangana: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ ఆవుదూడకు శునకం తల్లిగా మారింది. తల్లి చనిపోయిన దూడకు పాలు ఇచ్చి ఆకలి తీర్చింది. నెల క్రితం తల్లి చనిపోయిన ఆవు దూడకు డబ్బా పాలు తాగించడానికి కొందరు ప్రయత్నించారు. కాని దూడ ఆసక్తి చూపలేదు. అయితే గత ఐదు రోజుల నుంచి కుక్క పాలు తాగి దూడ ఆకలి తీర్చుకుంటుంది. ఇప్పుడా వీడియో అందరి హృదయాలను దోచుకుంటోంది.