kanimozhi meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో కనిమొళి భేటి... విషయం ఏంటంటే...

Update: 2025-03-13 06:36 GMT

kanimozhi meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో కనిమొళి భేటి... విషయం ఏంటంటే...

DMK leaders meets Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తమిళనాడు అధికార పార్టీ డిఎంకే నేతలు కలిశారు. డిఎంకే ఎంపీలు కనిమొళి, ఎన్.ఆర్. ఇలాంగో, మరో సీనియన్ నేత కె.ఎన్. నెహ్రూలు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. 2026 తరువాత చేపట్టనున్న డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభ స్థానాల సంఖ్య పరంగా అన్యాయం జరుగుతుందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు.

ఇదే విషయమై దక్షిణాది రాష్ట్రాలతో పాటు డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఇంకొన్ని రాష్ట్రాలు కలిసి రావాల్సిందిగా కోరుతూ సీఎం స్టాలిన్ ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. మార్చి 22న ఈ జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ కానుంది. డీలిమిటేషన్‌పై కేంద్రం తీరును వ్యతిరేకించే వారంతా కేంద్రానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను బలంగా చెప్పడం కోసం ఒక్క తాటిపైకి రావాల్సిందిగా స్టాలిన్ కోరుతున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే నినాదంతో కేంద్రం తీరును వ్యతిరేకిస్తున్నారు. దక్షిణాదిన ఒక్క ఎన్డిఏ మిత్రపక్షమైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మినహాయించి ఈ విషయంలో కేరళ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే వాయిస్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రిని మార్చి 22న జరగనున్న జేఏసీ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించడానికే స్టాలిన్ డిఎంకే నేతలను తన ప్రతినిధులుగా పంపించారు. 

Delimitation Explainer: డీలిమిటేషన్‌తో ఎవరికి ఎక్కువ లాభం? ఎవరికి ఎక్కువ నష్టం?

Full View

Tags:    

Similar News