స్మార్ట్ సిటి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కె.శశాంక

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న స్మార్ట్ సిటి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు.

Update: 2020-03-14 04:14 GMT
District Collector Shashank

కరీంనగర్ టౌన్: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న స్మార్ట్ సిటి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్మార్ట్ సిటి పనులపై మేయర్, మున్సిపల్ అధికారులు, కన్సల్టెంట్స్ తో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో భాగంగా బాస్కెట్ బాల్, వాలీ బాల్ కోర్టులు, ఇండోర్ స్టేడియం, షాపులు, డార్మెటరీ, కన్వెన్షన్ హాల్ పనులను మే నెల 31 వ తేదిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

అలాగే నగరంలో 3 ప్యాకేజీలలో రోడ్ల పనులు చేపట్టనుండగా మొదటి ప్యాకేజీలో 6 రహదారులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. నగర సుందరీకరణ పనులను కూడా పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మేయర్ వై.సునీల్ రావు, మున్సిపాల్ కమిషనర్ వల్లూరీ క్రాంతి, ఎస్.ఈ. భద్రయ్య, టౌన్ ప్లానింగ్ అధికారులు, కన్సల్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.



Tags:    

Similar News