నేడు అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
Assembly: ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడనున్న సీఎం కేసీఆర్
నేడు అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
Telangana Assembly: నేడు తెలంగాణ అసెంబ్లీ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు రానుంది. ఈనెల 6న ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు అసెంబ్లీలో 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాఖాలవారీగా డిమాండ్లు, గ్రాంట్లపై శనివారం అర్ధరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ కొనసాగడంతోపాటు ఆమోదం కూడా పొందాయి. ఈ నేపథ్యంలో ఇవాళ శాసనసభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు రానుంది. ఈ బిల్లుపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించిన అనంతరం నిరవధికంగా అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది.