తగ్గుతున్న వరద నీరు.. బయటపడుతున్న మృతదేహాలు

Update: 2020-10-15 11:44 GMT

హైదరాబాద్‌లో మంగళవారం కురిసిన వర్షాలకు ప్రజలు అతలాకుతలం అయ్యారు. కాలనీలు అన్ని వరదల్లో మునిగాయి. ఆ వరదల్లో కొంత మంది చిక్కిపోతే మరికొందరు ప్రాణాలు కోల్పోయ్యారు. వరదలో తప్పిపోయిన వారు ఎక్కడో ఒక దగ్గర చిక్కి సురక్షితంగా ఉంటారనుకుంటే వాళ్లకి నిరాశే మిగిల్చింది. నీటి ఉధృతి తగ్గుతున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.

సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సింగరేణి పార్క్ దగ్గర వరద నీటిలో ఒక మృతదేహం కనిపించింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జేసీబీ సాయంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పరిశీలించగా మాదన్నపేట కుర్మగూడ త్రి టెంపుల్ ప్రాంతానికి చెందిన ఎండీ అహ్పస్ ఉల్లాఖాన్‌గా గుర్తించారు.

ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇంజపూర్ దగ్గర చోటు చేసుకుంది. ఇంజపూర్ వాగులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. తోర్రరు గ్రామానికి చెందిన ప్రణయ్, ప్రదీప్‌లుగా గుర్తించారు. మంగళవారం సాయంత్రం తోర్రురూ గ్రామం నుంచి ఇంజపూర్ కు పానిపూరీ తినడానికి వెళ్తుండగా ఇద్దరు కొట్టుకుపోయారు. రెండు రోజుల తర్వాత మృతదేహాలు బయట పడడంతో తోర్రురు గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. పోలీసులు మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. 

Tags:    

Similar News