రాజంపేట మండలంలో దారుణం.. ఆస్తి కోసం కన్న తండ్రిని దహనం చేసిన కూతుళ్లు
Kamareddy: కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
రాజంపేట మండలంలో దారుణం.. ఆస్తి కోసం కన్న తండ్రిని దహనం చేసిన కూతుళ్లు
Kamareddy: ఆస్తి గొడవలు మానవత్వాన్ని మరిపిస్తున్నాయి. అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, భార్యాభర్తలు అనే తేడా లేకుండా హత్యలకు పాల్పడుతున్నారు. ఎకరం భూమి అమ్మితే వచ్చిన 10 లక్షలు ఇవ్వలేదని.. 70 ఏళ్ల తండ్రినే సజీవ దహనం చేశారు సొంత కూతుళ్లు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రాజంపేటకు చెందిన కొప్పుల ఆంజనేయులుకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే అంజనేయులుకు కొడుకులు లేరు. ముగ్గురు కూతుళ్ళకు పెళ్లిళ్లు కాగా లీల ఆమె కొడుకు భాను ప్రకాష్ అంజనేయులుతో ఉంటున్నారు. గంగమని కూడా రాజంపేటలోనే ఉండగా మరొక కూతురు వేరే గ్రామంలో ఉంటోంది. అయితే ఇటీవల ఆంజనేయులు ఎకరం భూమి అమ్మేయగా 10 లక్షల రూపాయలు వచ్చాయి. ఈ డబ్బుల విషయంలో తండ్రితో కూతుళ్లకు గొడవ జరిగింది. అయినా డబ్బులు ఇవ్వకపోవడంతో తండ్రిని ముగ్గురు కూతుళ్లు, మనవడి సహకారంతో గుడిసెకు నిప్పంటించారు. ఈ ఘటనలో గుడిసెలో ఉన్న ఆంజనేయులు సజీవదహనం అయ్యాడు. దాంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.