Daughter Killed Mother: జనగామ జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని చంపిన కూతురు
Daughter and Son-in-Law Murder Mother for Property in Jangaon
Daughter Killed Mother: జనగామ జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని చంపిన కూతురు
Daughter Killed Mother: సమాజంలో మానవత్వం, రక్త బంధాలు మంటల్లో కలుస్తున్నాయి. నవమాసాలు మోసి తల్లిని కన్న కూతురే భర్తతో కలిసి హత్య చేసింది ఓ కూతురు. ఆస్తికోసం అడిగితే ఒప్పుకోలేదని ప్లాన్ చేసి భర్తతో కలిసి తల్లిని హత్య చేసింది. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్దతండ గ్రామపంచాయతీలో చోటు చేసుకుంది.
దుబ్బ తండా ఎస్సీ గ్రామానికి చెందిన భూక్య వీరన్నతో మృతురాలు లక్ష్మి తన కూతురు సంగీతను ఇచ్చి వివాహం చేసింది. ఇటీవల 20 గుంటల భూమిని అమ్మిన లక్ష్మి.. కూతురు సంగీతకు 9 తులాల బంగారం ఇచ్చింది. అయితే భూమి అమ్మగా వచ్చిన మిగతా డబ్బులతో పాటు 20 గుంటల భూమిని తమకు ఇవ్వాలని గత కొంతకాలంగా లక్ష్మీని ఇబ్బంది పెడుతున్నారు కూతురు అల్లుడు. అందుకు లక్ష్మీ ఒప్పుకోకపోవడంతో ఆస్తిని కైవసం చేసుకోవాలని మర్డర్ స్కెచ్ వేసింది కూతురు. మంగళవారం అర్ధరాత్రి తల్లి ఇంటికి వచ్చిన సంగీత.. భర్తతో పాటు నిద్రిస్తున్న లక్ష్మి గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయింది. ఇరుగుపొరుగు వారు పోలీసులకు విషయాన్ని తెలపగా తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు నిందితులు.