భాగ్యనగరానికి మరో మణిహారం.. సోలార్‌ పైకప్పుతో సైకిల్‌ ట్రాక్..‌!

Cycle Track: భాగ్యనగరానికి మరో మణిహారం రాబోతుంది.

Update: 2022-09-06 03:17 GMT

భాగ్యనగరానికి మరో మణిహారం.. సోలార్‌ పైకప్పుతో సైకిల్‌ ట్రాక్..‌!

Cycle Track: భాగ్యనగరానికి మరో మణిహారం రాబోతుంది. ఔటర్ సర్వీసు రోడ్ల వెంట మూడు వరుసల అధునాతన సౌకర్యలతో సైకిల్ ట్రాక్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. దక్షిణ కొరియా తరహాలో సోలార్ ప్యానల్ పైకప్పు ఉండే విధంగా ఔటర్ సర్వీసు రోడ్డులో సైకిల్ ట్రాక్ నిర్మాణానికి సిద్ధం అవుతుంది. వచ్చే ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు రావాలని నిర్ధేశించారు. కోకాపేట ఇంటర్ ఛేంజ్ దగ్గర తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంఖుస్థాపన చేయనున్నారు.

రెండు కారిడార్లలో 23 కిలో మీటర్ల మేర 4.5 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసే సోలార్ సైకిల్ ట్రాక్ ఐటీ కారిడార్ నగర వాసులకు ఎంతగానో ఉపయోగపడనున్నది. టీఎస్‌రెడ్‌కో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నది. ఈ సోలార్‌ ప్యానెళ్ల ద్వారా 16 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందు కోసం 88.12 కోట్లతో HMDA-HGCL డిజైన్లను రూపొందించారు. నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14.50 కిలో మీటర్ల మేర ఒక కారిడార్. TSPA జంక్షన్ నుంచి నానక్‌రాంగూడ వరకు 8.50 కిలో మీటర్ల మేర మరో కారిడార్ ద్వారా సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు. దారిపొడవునా ఫుడ్ కోర్టులు, అత్యంత భధ్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. 

Tags:    

Similar News