Cyber Crime: వలపు వల విసిరి సొమ్ము కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు

*2.30 కోట్లు సొమ్ము కాజేసిన కేటుగాళ్లు *ఈ ఏడాది 158 కేసులు నమోదు *రూ.2.10 కోట్లు కాజేశారంటున్న పోలీసులు

Update: 2021-10-07 15:15 GMT

వలపు వల విసిరి సొమ్ము కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు(ఫైల్ ఫోటో)

Cyber Crime: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో న్యూడ్ వీడియో కాల్స్ పేరుతో మోసాలు పెరిగి పోతున్నాయి సాఫ్ట్ వేర్ ఉద్యోగులను, ముఖ్యంగా యువకులపై వలపు వల విసిరి నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడమని కేటుగాళ్లు ఎర వేస్తున్నారు ఆ వీడియో కాల్ ను రికార్డు చేసి ఆపై వాటిని అప్ లోడ్ చేస్తామని బెదిరించి లక్షలు, కోట్లల్లో సొమ్ము వసూలు చేస్తున్నారు కేటుగాళ్లు గత ఏడాది సైబరాబాద్ కమీషనర్ రేట్ పరిధిలో 98 కేసులు నమోదు కాగా బాధితుల్ని నుంచి కేటుగాళ్లు రూ.2.30 కోట్లు కాజేశారు ఈ ఏడాది 158 కేసులు నమోదు కాగా దాదాపు రూ. 2.10 కోట్లు కాజేశారని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు ఇలాంటి కాల్స్ పట్ల యువత అప్రమత్తం గా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు

Tags:    

Similar News